మణుగూరు టౌన్, అక్టోబర్ 3: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్తోపా టు నటుడు నాగార్జున కుటుంబంపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉ న్నాయని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అ ధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మంత్రిపై కాంగ్రెస్ అధిష్ఠానం గానీ, సీఎం రేవంత్రెడ్డిగానీ చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్ర జాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవము న్నా ఆమెను బర్తరఫ్ చేయాలన్నారు.
మహిళా వ్యతిరేకతకు నిదర్శనం: వైష్ణవ్
న్యూఢిల్లీ, అక్టోబర్ 3: నటి సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యా ఖ్యలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తీవ్రం గా తప్పుబట్టారు. ‘సినీ ప్రముఖుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తెలంగాణ మంత్రి చే సిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక ఆలోచనా విధానానికి నిదర్శనం. దేశానికి గర్వకారణమైన వినోద పరిశ్రమపై ఆ పార్టీ అభిప్రాయాలను ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నా యకత్వం నిశబ్దంగా ఉండటం చూస్తుంటే ఈ వ్యాఖ్యలకు వారి మద్దతు ఉన్నట్టు కనిపిస్తున్నది.’ అని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
సురేఖ వ్యాఖ్యలతో షాక్ అయ్యాను: స్మితా సబర్వాల్
కొండా సురేఖ వ్యాఖ్యలపై సీనియర్ ఐఏఎస్ స్మిత సబర్వాల్ స్పందించారు. మంత్రి గా ఉన్న సురేఖ ఇలాంటి అగౌరవ ప్రకటన చేయడం చూసి షాక్ అయినట్టు ఆమె పేర్కొన్నారు. ప్రజాజీవితంలో ఆరోగ్యకరమైన భాషను నిర్మిద్దామని, మహిళలు, కుటుంబాలు, సామాజిక నియమాలను గౌరవిద్దామని సూచించారు. మహిళలను థంబ్నెయిళ్లు, సంచలనాల కోసం ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారులను కూడా వదలడం లేదని, అనుభవంతో చెప్తున్నానని అన్నారు. ఎంత కష్టపడి పైకి ఎదిగితే, నిందలు వేసే ప్రయత్నమూ అంతే పెద్దగా జరుగుతుందని పేర్కొన్నారు.