హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన కన్నెపల్లి పంప్‌హౌస్ పునఃప్రారంభమైంది. తొలి రెండు మోటర్లు విజయవంతంగా నీటిని ఎత్తిపోయడంతో ఇంజినీరింగ్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల అసాధారణ రీతిలో కురిసిన వర్షాల వల్ల కన్నెపల్లి పంప్‌హౌస్ నీట మునిగిన విషయం తెలిసిందే. ఈ పంప్‌హౌస్‌లో మొత్తంగా ఒక్కోటి 40 మెగావాట్ల సామర్థ్యం గల 17 మోటర్లు ఉండగా.. వాటిలో 11 మోటర్లను అధికారులు వెట్న్‌క్రు సిద్ధం చేశారు. వాటిలో రెండు మోటర్ల వెట్న్‌న్రు రామగుండం ఈఎన్సీ ఎన్ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. మిగిలిన మోటర్లను ఈ నెల చివరినాటికి అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ను నిర్దేశిత గడువులోగా పునరుద్ధరించేందుకు కృషిచేస్తున్న ఇంజినీరింగ్ అధికారులకు ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్, ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు.