హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): హెచ్సీయూలో ఈనెల 2న విద్యార్థులపై ఎలాంటి లాఠీ ఛార్జ్ జరగలేదని మాదాపూర్ డీసీపీ వినీత్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆందోళన జరుపుతున్న విద్యార్థుల్లో కొంత మంది విధుల్లో ఉన్న మహిళా పోలీసులు, ఇతర పోలీసు సిబ్బందిని నెట్టివేసి, హోల్డింగ్ తాడును లాకోవడానికి ప్రయత్నించారని, దీంతో విద్యార్థుల చేతిలో నుంచి తాడును తీసుకోవడంతోపాటు పోలీసులను పక్కకు నెట్టేసేందుకు యత్నించిన గుంపును అక్కడి నుంచి చెదరకొట్టే క్రమంలో స్వల్ప బలప్రయోగం మాత్రమే చేసినట్టు డీసీపీ తెలిపారు. ఈ విషయం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తుందని, పలు పత్రికలు, టీవీ చానెళ్లలో వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని డీసీపీ పేర్కొన్నారు.