నాలుగో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని.. పోషణభారంతో విక్రయం
నాలుగోసారి ఆడపిల్ల పుట్టడంతో 16 రోజుల పసికందును తల్లిదండ్రులు విక్రయించిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. బాన్సువాడ కేంద్రంగా జరిగిన ఈ ఘటన వివరాలను ఎస్‌హెచ్‌వో తుల శ్రీధర్ వెల్లడించారు.
- బాన్సువాడలో ఘటన వెలుగులోకి
బాన్సువాడ, ఏప్రిల్ 10: నాలుగోసారి ఆడపిల్ల పుట్టడంతో 16 రోజుల పసికందును తల్లిదండ్రులు విక్రయించిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. బాన్సువాడ కేంద్రంగా జరిగిన ఈ ఘటన వివరాలను ఎస్‌హెచ్‌వో తుల శ్రీధర్ వెల్లడించారు. ఎల్లారెడ్డి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన కిష్టవ్వ, శివయ్య దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నాలుగో కాన్పులోనూ కిష్టవ్వ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నలుగురు ఆడపిల్లలను పోషించలేని స్థితిలో ఉన్న దంపతులు పసిపాపను విక్రయించారు.
పొతంగల్ మండలం హంగర్గ నుంచి బీర్కూర్ మండలం దామరంచకు వలస వెళ్లిన నీరడి శాంతీశ్వర్-అనురాధ దంపతులకు సంతానంలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎల్లారెడ్డి నుంచి బాన్సువాడకు బస్సులో కిష్టవ్వ దంపతులు వస్తుండగా, శాంతీశ్వర్-అనురాధ దంపతులు 16 రోజుల పాపను రూ.లక్షకు కొనుగోలు చేశారు. ఈ విషయం బయటకు రావడంతో అంగన్వాడీ టీచర్ ఇంద్రాణి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసిన బాన్సువాడ పోలీసులు.. పసికందును స్వాధీనం చేసుకుని ఐసీడీఎస్ సిబ్బందికి అప్పగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

