జగిత్యాల : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెగడపల్లి మండల కేంద్రలోని ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్నలా మారి వారి విహాలు జరిపిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు.
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, వారి సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. మంత్రి వెంట స్తానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.