మహబూబాబాద్ రూరల్, మార్చి 28 : ఒకే ఇంట్లో ముగ్గురు ఆడబిడ్డలకు వివాహాలు కాగా, వారందరికి కల్యాణలక్ష్మి వర్తించింది. తాజాగా మూడో కూతురికి చెక్కు మంజూరు కాగా మంగళవారం అందుకున్నారు. మహబూబాబాద్ మండలం మల్యాల శివారు దామ్మ తండా పరిధి పెద్ద రామోజీ తండాకు చెందిన బానోత్ బోడి, బక్క దంపతులకు నలుగురు సంతానం. ఇందులో ముగ్గురు ఆడ పిల్లలు. పెద్ద కూతు రు అనసూర్య వివాహం 2015 లో జరగ్గా అప్పుడు కల్యాణలక్ష్మి కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.75 వేల చెక్కు వచ్చింది. రెండో కూ తురు సరిత వివాహం 2019లో కాగా రూ.1,00,116 అందించింది. మూడో కూతురు అనిత వివాహం ఇటీవల జరగ్గా మంగళవారం ఎమ్మెల్యే శంకర్‌నాయక్ చేతుల మీదుగా బానోత్ బోడి చెక్కు అందుకున్నారు. ఈ సందర్భంగా బానోత్ బోడి మాట్లాడు తూ తమ ఇంట్లో ముగ్గురు పిల్లలకు కల్యాణలక్ష్మి రావడం ఆనందంగా ఉన్నదన్నారు. సీఎం కేసీఆర్ తమ లాంటి పేద కుటుంబాలకు ధైర్యం కల్పిస్తున్నారని కొనియాడారు.