నాగర్‌కర్నూలు: నాగరకర్నూల్ జిల్లాలోని వెల్దండ సమీపంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (Kalwakurthy Lift irrigation) డీ82 ప్రధాన కాలువకు గండి పడింది. వరత ప్రవాహం పెరగడంతో కాలువ తెగిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో పొలాలు నీటమునిగాయి. కాగా, గత నెల 27న ఈ కాలువను స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పరిశీలించారు.
గత నెల 8న కల్వకుర్తి ఎత్తిపోతల పథక మోటార్లను గుట్టుచప్పుడు కాకుండా కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించిన విషయం తెలిసిందే. కృష్ణానదికి వరద పోటెత్తిన నేపథ్యంలో కల్వకుర్తి పంప్‌హౌస్ మోటర్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోసి రైతుల పొలాలకు మళ్లించకుంటే కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మంది అన్నదాతలతో కలిసి మేమే మోటర్లను ఆన్‌చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరిండంతో మొద్దు నిద్ర వీడిన ప్రభుత్వం హడావిడిగా నీటిని విడుదల చేసింది. అయితే సరిగ్గా నెల రోజుల్లోనే డీ82 ప్రధాన కాలువ తెలగిపోవడం గమనార్హం.