కల్వకుర్తి, జూన్ 25 : నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం గుండూర్‌కు చెందిన నంబి వెంకటయ్య, అతడి దాయాదు ల మధ్య భూ తగాదా విషయమై కల్వకుర్తి పీఎస్‌లో కేసు నమోదైంది. స్టేషన్ బెయిల్ కోసం వెంకటయ్యను రెండో ఎస్సై రాంచందర్‌జీ రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు.
బాధితుడి నుంచి ఎస్సై డబ్బులు తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారరు. గురువారం నాంపల్లి ఏసీబీ కోర్టులో రాంచందర్జీని హాజరుపర్చనున్నట్టు డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.