వరంగల్ : బీఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్, బీపీటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ,ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ ప్రకటన జారీ చేశారు.
నాలుగేళ్ల డిగ్రీ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ (బీఎస్సీ నర్సింగ్ ), రెండు సంవత్సరాల డిగ్రీ కోర్సు పోస్ట్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ (పీబీబీఎస్సీ నర్సింగ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపి ( బీపీటీ ) కోర్సుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు కలిపించనున్నారు.
అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ ఉదయం 9గంటల నుంచి అక్టోబర్ 3వ తేదీ సాయింత్రం 6గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను యూనివర్సిటీ ప్రకటిస్తుంది.
దరఖాస్తు ఫారం నింపే సమయంలో సాంకేతిక సమస్యలకు 9392685856, 7842542216, 9059672216 నెంబర్లకు, నిబంధనలు తెలుసుకోవాలంటే 9490585796, 8500646769 నెంబర్లకు ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఫోన్ చేయవచ్చు. ప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.