హైదరాబాద్ మే 25 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు ఖర్చులు భరించేది ప్రభుత్వమా? లేక కాంట్రాక్టర్లా? అని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వయి హరీశ్‌బాబు డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ ప్రభుత్వం విచారణ పేరిట హంగామా చేస్తుండగా, కాంట్రాక్టర్లు మాత్రం మరమ్మతు ఖ ర్చులు ప్రభుత్వమే భరించాలంటూ లేఖ రాయడం పలు అనుమానాలకు తావిస్తున్నదని ఆదివా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.