సిద్దిపేట, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒక నాడు మెతుకు సీమ అంటే నెర్రెలు బారిన, బీడు భూములు, ఎండిన చెరువులు..! సుక్క నీటి కోసం వందల ఫీట్ల లోతుకు బోర్లు వేసిన చుక్క కాన రాక పోయేది. ఒక్కో రైతు పదుల సంఖ్యలో బోర్లు వేసేవారు. సమైక్య పాలనలో ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాలో కనీసం ఒక్క ప్రాజెక్టు నిర్మాణం చేయకపోవడమే గాక కనీసం తట్టెడు మట్టి ఎత్తిన పాపాన పోలేదు. ఇవన్నీ సమైక్య రాష్ట్రంలో రైతులు పడ్డ కష్టాలు.. స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమ నేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ (KCR) కావడంతో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు. గల గల పారేటి గోదావరి నీళ్లను బీడు భూములకు మళ్ళించారు. నీటి పారుదల రంగానికి భారీ స్థాయిలో నిధులు కేటాయించి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మించారు. కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టుతో వందలాది చెరువులు, చెక్‌డ్యాంలను మండు టెండల్లోనూ నింపారు. ఎక్కడో పుట్టిన గంగమ్మను రంగనాయక, మల్లన్నసాగర్ రిజర్వాయర్లను నింపుకుంటూ 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి తీసుకవచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మెతుకు సీమలో గోదావరి జలాలు పారి పచ్చని పంటలతో మెతకు సీమకు పూర్వవైభవం వచ్చింది.రైతులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా నిచ్చింది. ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు పై కుట్రలు చేస్తుంది. ప్రాజెక్టును నిర్విర్యం చేసే పన్నాగం పన్నుతుంది. చుక్క నీరు లేనటువంటి జిల్లాకు కాళేశ్వర జలాలు తీసుకవచ్చి రైతుల పొలాలను తడిపిన ఘనత కేసీఆర్ దక్కుతుంది.
మాజీ సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో మనం కలలు కన్న ప్రాజెక్టులు కల్ల ముందే సాకారమైనవి.ఎడారిగా మారిన జిల్లాలోసిరులు పండుతున్నాయి.భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయి కేసీఆర్ భగీరథ ప్రయత్నం..మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నిరంతర శ్రమ, కృషి ఫలితంగా గోదావరి జలాలతో బీడు భూములు పచ్చని పంట పొలాలుగా మారాయి. సిద్దిపేట జిల్లాను సస్యశ్యామలం చేసే గోదావరి జలాలు మిడ్‌మానేరు నుంచి వస్తున్నాయి. మేడిగడ్డ నుంచి తరలించిన కాళేశ్వర జలాలతో పలు ప్రాజెక్టులకు జీవం పోస్తూ చివరి ప్రాజెక్టు ఐన సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ ప్రాజెక్టుకు చేరుతున్నాయి.తెలంగాణ ర్రాష్టం అవతరించిన 2014 సంవత్సరం తరువాత నుండి సాగునీటి రంగం లో విప్లవాత్మక ప్రగతిని సాధించాం.
సిద్దిపేట జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికిగాను అత్యధిక శాతం నిధులు వెచ్చించి బృహత్తరమైన నీటి ప్రాజెక్టుల ను కేసీఆర్ శరవేగంగా పూర్తి చేశారు. ప్రపంచం లో కెల్లా అతిపెద్దదైన బహుళ దశల ఎత్తిపోతల, బహుళార్ధసాధక కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నర ఏండ్లలో రికార్డు సమయం లో పూర్తి చేయడం జరిగింది.చిన్న నీటిపారుదల చెరువులను మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్దరించడం మరియు పూడికతీత పనులను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది.అత్యధిక సంఖ్య లో చెక్ డ్యాంలు నిర్మించడం వలన భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినవి. కరువు కాటకాలతో అల్లాడిన జిల్లా లక్షల ఎకరాలకు సాగు నీటి సరఫరా జరుగుతున్నది.
బహుళార్ధసాధక కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణా ర్రాష్టంలోని 13 ఉమ్మడి జిల్లాలోని 18.26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కు నీరు అందిచ్చుటకు మరియు 18.83 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ఏడు లింకులు, మూడు బ్యారేజులు 15 రిజర్వాయర్ లు, 22 పంప్ హౌసులు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్లు, 1,531 కిలో మీటర్ల ప్రధాన కాలువ, 203 కిలో మీ పొడవుగల సొరంగం నిర్మించడం జరిగినది. కాళేశ్వరం ప్రాజెక్టులో జలాశయాల నిలువ సామర్థ్యం మొత్తం 141.00 టీఎంసీ గోదావరి నీరు మెడిగడ్డ బ్యారేజు లెవెల్ +88 మీటర్ల నుంచి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లెవెల్ +618 మీ. ఎత్తుకు బహుళ దశలలో లిఫ్ట్ చేయబడుచున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సిద్దిపేట జిల్లా సాగునీటి పారుదల రంగంలో కేంద్రబిందువుగా మారింది. దేశ చర్రితలో చిర స్థాయిగా నిలిచే విధంగా వేగవంతంగా ప్రాజెక్ట్ పనులు జరిగాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ – 10లో భాగంగా మిడ్‌మానేరు నుంచి గోదావరి నీటిని అన్నపూర్ణ రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. దీని కెపాసిటీ 3.50 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్, ఎల్లాయిపల్లి, కొచ్చగుట్టపల్లి గ్రామాల మధ్యన ఈరిజర్వాయర్ ను నిర్మించారు. 2020 మార్చి మాసం నుంచి ఈ రిజర్వాయర్‌లో గోదావరి జలాలు నింపి మండు వేసవిలో చెరువులను నింపుతున్నారు. ఈ రిజర్వాయర్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాకు 30వేల ఎకరాల ఆయకట్టు, సిద్దిపేట జిల్లాకు 15,200 ఎకరాలు సాగులోకి వచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ -11లోఅన్నపూర్ణ నుంచి రంగనాయకసాగర్ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోస్తున్నారు. దీని కెపాసిటీ 3 టీఎంసీల సామర్థ్యం. ఇది చంద్లాపూర్, పెద్దకోడూరు గ్రామాల మధ్యన ఒక ద్వీప కల్పంలా ఉంటుంది.రిజర్వాయర్ మధ్యలో ఉన్న గుట్టపై ఎస్ఈ కార్యాలయంతోపాటు ఫోర్ సూట్ గెస్ట్ హౌజ్‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్ బండ్ నిర్మాణం 8.6 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. 2020 ఎప్రిల్ 23న అప్పటి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు పంపులను ఆన్ చేసి గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ రిజర్వాయర్ నుంచి లక్షా 10 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. దీనికి కుడి, ఎడమ కాల్వల నిర్మించారు. కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను 23 ఫ్రిబవరి-2022 లో,కొండపోచమ్మ రిజర్వాయర్‌ను 29 మే-2020 లో మాజీ సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు.
ప్రతి యేటా గోదావరి జలాలతో రిజర్వాయర్లను నింపి మండు టెండల్లో చెక్‌డ్యాంలను చెరువులను నింపుతున్నారు. ఇక జిల్లాలోని బెజ్జంకి మండలంలోని తోటపల్లి వద్ద 0.32 టీఎంసీల సామర్ధ్యంతో తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ ఉంది. కొమురవెల్లి మండలం ఐనాపూర్ – తపాస్‌పల్లి గ్రామాల శివారుల మధ్య తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను 0.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఈ రిజర్వాయర్ ద్వార జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, బచ్చన్నపేట మండలాల్లోని చెరువులను ప్రతియోట నింపుతున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేశారు.దీని సామర్ధ్యం 8.23 టీఎంసీలుఇటివలనే పంపులను ఆన్ చేసి ట్రాయల్ రన్ సైతం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్, ఎల్లాయిపల్లి, కొచ్చగుట్టపల్లి గ్రామాల మధ్యన అన్నపూర్ణ (అనంతగిరి 3.50 టీఎంసీల సామర్థ్యం) రిజర్వాయర్‌ను నిర్మించారు. దీనిని సుమారుగా రూ. 2,700 కోట్ల వ్యయంతో చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ – 10లో భాగంగా శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్ నుంచి నీటిని అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి తరలిస్తున్నారు. అప్రోచ్ చానల్, గ్రావిట్ కెనాల్ 2.380, మెయిన్ కెనాల్ 7.65 కిలో మీటర్లు ఉంది. తిప్పారం వద్ద 400/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇల్లంతకుంట మండలం తిప్పారం వద్ద ఆసియాలోనే అతి పెద్ద ఓపెన్ సర్జిపుల్ పంపు నిర్మించారు. 92 మీటర్ల లోతులో ఈ ఓపెన్ సర్జిపుల్ పంపు ఉంది.
ఒక్కో పంపు 106 మెగా వాట్లతో కలిగినవి నాలుగు, 120 మెగా వాట్ల ట్రాన్స్పార్మర్లను నాలుగింటిని బిగించారు. ఇక్కడే నాన్ ఓవర్ పుల్ డ్యామ్ కట్టారు. నీళ్లు సర్జిపుల్ నుంచి బయటకు ఎత్తిపోస్తాయి.ఈ రిజర్వాయర్‌తో రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు 30 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. సిద్దిపేట జిలాలోని చిన్నకోడూరు, బెజ్జంకి మండలాల్లో 15,200 ఎకరాలకు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో 14,000 ఎకరాలకు, కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలంలో 800 ఎకరాలకు సాగునీరందిస్తుంది. కొచ్చగుట్టపల్లి ముంపు గ్రామానికి సిద్దిపేట వద్ద కొత్త కాలనీ ఏర్పాటు చేశారు. ఆ గ్రామానికి రంగనాయక పురంగా నామకరణం చేశారు.
సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ – పెద్దకోడూరు గ్రామాల శివారులో శ్రీరంగనాయక సాగర్ రిజర్వాయర్‌ను 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 11లో భాగంగా నిర్మించిన ఈ రిజర్వాయర్ బండ్ 8.65 కి.మీ పొడవు ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్ (బండ్ ) 1.746 కి.మీ వద్ద స్లూయిస్(తూం)ను ఏర్పాటు చేసి నాలుగు గేట్లను బిగించారు. హెడ్‌రెగ్యులేటర్ ద్వారా గ్రావిటీ కెనాల్, సొరంగం ద్వారా గోదావరి జలాలు శ్రీ రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేస్తున్నారు.ఈ రిజర్వాయర్ కు 2 ప్రధాన తూములు నిర్మించారు.
గ్రావిటీ కాలువ, టన్నెల్ మరియు పంప్ హౌజ్‌లు పనులు పూర్తి చేసి, ఈ రిజర్వాయర్‌ను 24 ఏ్రపిల్-2020 లో అప్పటి మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కేటీఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు.ఈ రిజర్వాయర్ ను నిర్మించడం కొరకు చిన్న కోడూర్, సిద్దిపేట మండలం లో 2,184 ఎకరాలకు భూమినిసేకరించారు.11వ ప్యాకేజిలో భాగంగా గ్రావిటీ కాలువ, టన్నెల్ మరియు పంప్ హౌస్ తో పాటు, రంగనాయక సాగర్ కుడి మరియు ఎడమ ్రపధాన కాలువల, డ్రిస్టిబ్యూటర్ లు, పిల్ల కాలువల నిర్మాణం చేయడంతో 1,10,000 ఎకరాల ఆయకట్టు సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల మానకొండూర్, జనగాం నియోజక వర్గం లో ప్రతిపాదించి అందించడం జరుగుతుంది.
ఎడమ కాలువ ద్వారా 70,000 ఎకరాలు కుడి కాలువ ద్వారా 40,000 ఎకరాలు ఆయకట్టు ్రపతిపాదించారు.సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నంగనూర్, నారాయణరావుపేట్ మరియు చిన్న కొడూరు, బెజ్జంకి మండలాల్లో 51 గ్రామాలలో 76,931 ఎకరాల ఆయకట్టు , రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట, ముస్తాబాద్ మరియు తంగళ్ళపల్లి మండలాలలో 29 గ్రామాలలో 33,069 ల ఎకరాలు ఎకరాల ఆయకట్టు ప్రతిపాదించారు.రంగనాయక సాగర్ కింద ్రపధాన కాలువ (45.572 కి.మీ) ల పనులు పూర్తి చేయడం జరిగినది.డ్రిస్టిబ్యూటరి కాలువలు 102 కి మీ గాను 87 కి.మీ. పూర్తి చేశారు. మైనర్ కాలువల పనులు 303 కి మీ లకు గాను 42 కి మీ పూర్తి చేశారు.
బహుళార్థసాధక కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా కొమరవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ 50 టీఎంసీలసామర్థ్యంతో నిర్మించారు. కేంద్ర జల సంఘం సూచనల మేరకు వ్యవసాయానికి, త్రాగు నీటికి, పర్రిశమలకు నీటి సరఫరాలో అంతరాయం లేకుండా ఉండుట కొరకు తొగుట మండలం దగ్గర ఈ భారీ రిజర్వాయర్‌ను నిర్మించారు.ఈ రిజర్వాయ ర్ను నిర్మించడం కొరకు తొగుట, కొండపాక మండలాల్లో భూమిని సేకరించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణము వలన 8 గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి అవి ఎ్రరవల్లి, సింగారం, పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మిపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, మరియు పాక్షికంగా ముంపునకు గురైన తోగుట, తుక్కాపూర్,తిప్పారం, మంగోల్ గ్రామాలు ఉన్నాయి. ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలు 5,205. ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు గజ్వేల్ మండలం లోని మ్రుటాజ్పల్లి మరియు సంగాపూర్ గ్రామాలలో 600 ఎకరాలలో ఆర్అండ్ ఆర్ కాలనీ నిర్మించి కేటాయించారు. ఈ రిజర్వాయర్‌ను 23 ఫ్రిబవరి-2022 లో మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు.
రిజర్వాయర్ మొత్తం పొడవు 22. 600 కి.మీటర్లు, ఈ రిజర్వాయర్ కు 5 ప్రధాన తూములు నిర్మించారు. వీటిలో 1) 0.75 కి.మీ. వద్ద తపాసుపల్లి రిజర్వాయర్ కు నీటి సరఫరా కొరకు, 2) 2.525 కి.మీ. వద్ద పాకేజ్-14మరియు 15 కు నీటి ని తరలించడానికి, 3) 2.891 కీ.మీ వద్ద పాకేజ్-13 మరియు 17 కు నీటి ని తరలించడానికి, 4) 4.800 కి.మీ వద్ద తాగునీటి సౌకర్యానికి మిషన్ భగీరథీ కొరకు 5) 21,350 కీ.మీ. వద్ద పాకేజ్ 12 కాలువ కు నీటిని తరలించడానికి ఏర్పాటు చేశారు.మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా మొత్తం 16,43,665 ఎకరాలకు నీటి సరఫరా కొరకు ప్రతిపాదించారు. దానిలో 12,18,080 ఎకరాల కొత్త ఆయకట్టుకు పాకేజ్12,13,14,15,16,18, 19 ద్వారా నీరు అందించడానికి ప్రతిపాదించారు.4,25,585 ఎకరాల ఆయకట్టు ను సింగూర్ ్రపాజెక్టు, వనదుర్గ (ఘనపూర్ అనికట్ట), నిజాం సాగర్, తపాసుపల్లి రిజర్వాయర్ల ద్వారా స్థిరీకరించారు..
మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా మొత్తం 10 జిల్లాలు లబ్ది పొందుతాయి. అవి
మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా 24 నియోజకవర్గాలకు లాభం చేకూరుతుంది. వీటిలో..
1. సిరిసిల్ల, 2. సిద్దిపేట 3.దుబ్బాక 4. గజ్వేల్, 5. మెదక్, 6. నర్సాపూర్, 7. సంగారెడ్డి 8. జహీరాబాద్, 9. నారాయణఖేడ్, 10. ఆందోల్, 11. పటాన్ చెరు 12. ఆలేరు, 13. భువనగిరి ,14. మునుగోడ్, 15. నకిరేకల్, 16. కామారెడ్డి, 17. బాన్సువాడ, 18. జుక్కల్, 19. యెల్లారెడ్డి. 20. మేడ్చల్, 21. కుత్బుల్లాపూర్, 22. భోధన్, 23. నిజామాబాద్, 24. జనగామలు ఉన్నాయి.
మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా మిషన్ భగీరథ లో భాగంగా మంగోలు గ్రామంలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించి దాని నుంచి 540 మిలియన్ లీటర్ పర్ డే (ఎంఎల్డీ) శుద్ధమైన తాగు నీటిని 7 జిల్లాలలోని 10 నియోజకవర్గాలకు సరఫరా.. దీనిలో బాగంగా 270 మిలియన్ లీటర్ పర్ డే (ఎంఎల్డీ) శుద్ధ తాగు నీటి సరఫరా వ్యవస్థను 10 ఏ్రపిల్ 2023 న అప్పటి మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌లు ప్రారంభించారు.
బహుళార్ధ సాధక కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ 15టీఎంసీల సామర్థ్యం తో ఆయకట్టు సాగు, తాగునీరు మరియు పర్రిశమల కొరకు మర్కుక్ మండలంలోని, పాములపర్తి వద్ద నిర్మించారు. ఈ రిజర్వాయర్‌ను నిర్మించడం కోసం ములుగు మండలం మామిడియాల, బైలాన్పూర్,తానేదార్పల్లి గ్రామాలలో భూమిని సేకరించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణము వలన మూడు గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి.్రపాజెక్టు నిర్వాసితుల కుటుంబాల సంఖ్యా 1860. ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు ములుగు మండలం లోని తునికి బొల్లారం ్రగామం లో ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మించారు.ఈ రిజర్వాయర్‌ను 29 మే-2020 లో సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు.
ఈ రిజర్వాయర్ యొక్క మొత్తం పొడవు 15 కి.మీ ఉంటుంది.ఈ రిజర్వాయర్ కు 4 ్రపధాన తూములు నిర్మించారు.1) 1.775 కి.మి వద్ద సంగారెడ్డి కాలువ కు నీటి సరఫరా కొరకు, 2) 6.925 కి.మీ వద్ద జగదేవపూర్ కాలువ కు నీటి ని తరలించడానికి, 3) 9.075 కి.మీ వద్ద కేశవపూర్ రిజర్వాయర్ కు నీటిని తరలించడానికి, 4) 15.54 కి.మీ వద్ద హైలేవల్ స్లూయిస్ కు నీటిని తరలించడానికి ఏర్పాటు చేశారు. కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ ద్వారా మొత్తం 2,85,280 ఎకరాలకు సాగు నీరును అందిస్తున్నారు.
కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ ద్వారా లబ్ది పొందే జిల్లాలు మొత్తం 5 ఉన్నాయి. వీటిలో 1. సిద్దిపేట, 2 మెదక్, 3. సంగారెడ్డి, 4. యాద్రాది భువనగిరి, 5. మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలు కాగ కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ ద్వారా లబ్ది పొందే నియోజికవర్గాలు మొత్తం10 కాగ వీటిలో 1. దుబ్బాక, 2. గజ్వేల్,, 3. మెదక్, 4. నర్సాపూర్, 5. సంగారెడ్డి, 6. పటాన్ చెరు, 7. ఆలేరు, 8. భువనగిరి,9 కుత్బుల్లాపూర్, 10. మల్కాజ్ గిరి లు ఉన్నాయి. క్వాలల నిర్మాణానికి గాను అవసరమయిన 4,636 ఎకరాలకు గాను 4,636 ఎకరాల భూమిని సేకరించారు. కొండపోచమ్మ సాగర్ ద్వారా 2,85,280 ఎకరాల ఆయకట్టు ను అభివృద్ధి పరుచుటకు గాను 8 కాలువల (గజ్వేల్, రామాయంపేట, కిష్టాపూర్, ఉప్పరపల్లి, శంకరంపేట్, జగదేవపూర్, తుర్కపల్లి, యం. తుర్కపల్లి) భూసేకరణ దాదాపుగా పూర్తి చేశారు.
కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నిజాంసాగర్ వరకు నీటిని అందించి రికార్డు సృష్టించారు.కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వార హల్ది వాగు, మంజీరా గుండా 90 కి.మీటర్లు ప్రయాణించి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలం గొల్లి లింగాల వద్ద నిజాంసాగర్‌లో గోదావరి జలాలు కలిసాయి. ఇది ఒక రికార్డు అని చెప్పాలి.వర్గల్ మండలం( సంగారెడ్డి కెనాల్ నుంచి)లో వరుసగా 4 పెద్ద చెరువులు నింపుకొని హల్ది వాగు పైన 32 చెక్‌డ్యాంలను నింపింది. వీటిలో సిద్దిపేట జిల్లాలో 09 చెక్‌డ్యాంలు, మెదక్ జిల్లాలో 23 చెక్‌డ్యాం లు నింపారు.మండు టెండల్లో గోదావరి జలకలను సంతరించుకున్నాయి.
మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ మండలంలో చేబర్తి పెద్ద చెరువు వద్ద కుడ్లేరు వాగు ప్రారంభం అవుతుంది.ఇదే వాగును కూడవెళ్ళి వాగుగా పిలుస్తారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ మరియు దుబ్బాక నియోజకవర్గంలో కూడెల్లి వాగుకు మరియు దాని పై నిర్మించిన 33 చెక్ డ్యామ్‌లకు 2020-21 సంవత్సరం నుండి 6,308 ఎకరాల ఆయకట్టు అందించారు. గజ్వేల్ నియోజకవర్గంలో 9 చెక్ డ్యామ్లకుగాను 2,380 ఎకరాల ఆయకట్టు పారుతుంది. ఈ క్రమం లో కూడెల్లి వాగు జీవ నదిగా మారి ఎగువ మానేరు డ్యామ్ వరకు నీరు అందించడం తో పాటు దాని కింద. 16,000 ఎకరాల ఆయకట్టు ను స్థిరీకరించడం జరిగింది. ఈవాగు పై మొత్తం 39 చెక్‌డ్యాంలు ఉన్నాయి. మండు టెండల్లో ఇవన్నీయు పొంగి పొర్లుతున్నాయి. కూడవెల్లి వాగుతో గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్, జగదేవ్‌పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట, మిరుదొడ్డి ,దుబ్బాక మండలాల మీదుగా రాజన్నసిరిసల్ల జిల్లాలోని గంబీరావుపేట మండలంలోని ఎగువమానేరు వరకు ప్రవహించింది.
1) రంగనాయక సాగర్ రిజర్వాయర్ (3 టీఎంసీలు)
– చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ వద్ద పంపు హౌజ్ నిర్మాణం
– 4 పంపులు , ఒక్కొక్కటి 134 మెగావాట్ల సామర్థ్యం
2) మల్లన్నసాగర్ (50 టీఎంసీలు)
– తొగుట మండలం తుక్కాపూరు వద్ద పంప్‌హౌజ్ నిర్మాణం
-8 పంపులు, ఒక్కొక్కటి 43 మెగావాట్ల సామర్థ్యం
3)కొంండపోచమ్మ రిజర్వాయర్ (15 టీఎంసీలు )
– అక్కారం వద్ద పంపుహౌజ్ నిర్మాణ
– 6 పంపులు, ఒక్కొక్కటి 27 మెగావాట్ల సామర్థ్యం
– మర్కూక్ వద్ద పంపుహౌజ్ నిర్మాణం
-6 పంపులు, ఒక్కొక్కటి 34 మెగావాట్ల సామర్ధ్యం