Kakatiya University | హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 28: కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్ మాదక ద్రవ్య రహిత ప్రాంగణమని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం అన్నారు. విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కాలేజీ (కో ఎడ్యుకేషన్) ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.రమణ అధ్యక్షతన, కళాశాల సెమినార్ హాల్లో ‘సంక్షేమ శాఖ, మాదకద్రవ్య నియంత్రణ విభాగం కేయూ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ ఎన్ఎస్సెస్ యూనిట్ల’ సంయక్త నిర్వహణలో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ 5వ వార్షికోత్సవం ‘మాదక ద్రవ్య వ్యతిరేక అవగాహన’ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే హానికరప్రభావాలు, వాటి పరిణామాలను వివరించారు. కేయూ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవనశైలిని కొనసాగించాలన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ అప్పయ్య, జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి, మాదక ద్రవ్య నియంత్రణ విభాగం డీఎస్పీ రమేశ్ కుమార్, ఎస్ఐ రవీందర్, ఎన్జిఓ అధికారి ఆచార్య మాదకద్రవ్య వ్యసనానికి సంబంధించిన చట్టాలు, నిబంధనలు, వాటికి సంబంధించిన చట్టపరమైన పరిణామాలను వివరించారు. కేయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్.రమణ, ఎన్ఎస్సెస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, ఆసిం ఇక్బాల్, చి.రాధిక, కె.సుమలత, వి.మహేందర్, సూపరింటెండెంట్ ప్రభాకర్, విజయ్, కల్పనాదేవి, కుమారస్వామి, ఎన్ఎస్సెస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డి.శిలాజా, ఎం.సౌజన్య, జిల్లా అధికారులు, అధ్యాపకులు, ఎన్ఎస్సెస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొని మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలని ప్రతిజ్ఞ చేశారు.