హైదరాబాద్ : విలక్షణ నటుడు, మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిసాయి. అంతకు ముందు కైకాల ఇంటి నుంచి బయలు దేరిన పార్థివదేహం ఊరేగింపులో అభిమానులు, కుటుంభ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. అనంతం అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలను నిర్వహించారు. మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ పార్థివదేహంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు.
మంత్రి మీడియాతో మాట్లాడుతూ కైకాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.కీర్తిశేషులు కైకాల తెలుగుదేశం పార్టీ ఎంపీగా పనిచేసినప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, సత్యనారాయణ తనతో ఆత్మీయంగా, సన్నిహితంగా ఉండేవారని పేర్కొన్నారు. కైకాల నటుడిగా, రాజకీయ నేతగా చేసిన సేవలకు గుర్తింపుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో నిర్వహించారని తెలిపారు.సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు