న్యూఢిల్లీ, జూలై 1: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీనరేగా) స్థానంలో తీసుకువచ్చిన వీబీ-జీరామ్జీ చట్టం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త చట్టం కింద ఉపాధి హామీ పనిదినాలు ఏడాదికి 100 రోజుల నుంచి 125 రోజులకు పెరిగాయి. అంతేగాక సగటు రోజువారీ వేతనం రూ. 298.8 నుంచి రూ. 327.4కి పెరిగింది. అంటే రోజుకు రూ. 28.6 చొప్పున పెరిగింది. సకాలంలో వేతనాల చెల్లింపు, నిరంతరాయంగా పనులు జరిగేందుకు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 95,692.31 కోట్లను కేటాయించింది. ఈ పథకం జాతీయ స్థాయి ప్రారంభోత్సవం జూలై 2న(గురువారం) ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ముక్కవారిపల్లి గ్రామంలో జరుగుతుంది.
అన్ని ఏర్పాట్లు పూర్తి
ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. తమ జాబ్ కార్డులకు సంబంధించి ఈ-కేవైసీ ప్రక్రి య పూర్తయిన వారు కొత్త గ్రామీణ ఉపాధి హామీ కార్డులు పొందే వరకు తమ ప్రస్తుత జాబ్ కార్డులనే ఉపయోగించవచ్చు. 29 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ చట్టం కోసం బడ్జెట్ను కేటాయించగా 24 రాష్ర్టాలు ఇప్పటికే ఈ పథకాన్ని ప్రారంభించాయి.
రాష్ర్టాల నెత్తిన 40% ఖర్చు
ఈ పథకం వ్యయాన్ని కేంద్ర, రాష్ర్టాలు పంచుకుంటాయి. చాలావరకు రాష్ర్టాల్లో కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వాలు 40% ఖర్చును భరిస్తాయి.
జీ రామ్ జీ స్వరూపం