మరింత తగ్గిన బంగారం ధర
బంగారం ధరలు మరింతగా క్షీణించాయి. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల ధర బుధవారం రూ.1,300 తగ్గి రూ.1,44,500 (అన్ని పన్నులు సహా)గా నమోదైంది. మంగళవారం కూడా రూ.800 దిగజారిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే కిలో వెండి ధర రూ.5,000 ఎగిసింది.
- రెండు రోజుల్లో తులం రూ.2,100 డౌన్
న్యూఢిల్లీ, జూలై 1: బంగారం ధరలు మరింతగా క్షీణించాయి. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల ధర బుధవారం రూ.1,300 తగ్గి రూ.1,44,500 (అన్ని పన్నులు సహా)గా నమోదైంది. మంగళవారం కూడా రూ.800 దిగజారిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే కిలో వెండి ధర రూ.5,000 ఎగిసింది.
రూ.2,35,000 వద్ద స్థిరపడింది. అంతకుముందు రోజు రూ.6,000 పుంజుకున్న సంగతి విదితమే. కాగా, హైదరాబాద్‌లో 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) పుత్తడి రేటు తులం రూ.1,29,050 పలికింది. ఈ ఒక్కరోజే రూ.1,150 క్షీణించింది. ఇక అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ విలువ 21.75 డాలర్లు తగ్గి 3,986.07 డాలర్లుగా ఉన్నది. సిల్వర్ 58 డాలర్లకు దిగింది. అమెరికా కరెన్సీ డాలర్ బలపడటం, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ పెరుగుతుండటంతో మార్కెట్లో బంగారం రేట్లు ఒత్తిడికి లోనవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

