Kadiyam Srihari | ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి బీ-ఫామ్ అందుకున్నారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కడియం శ్రీహరి శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా బీ-ఫామ్‌ను శ్రీహరికి అందజేశారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బదులుగా కడియం శ్రీహరికి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీ-ఫామ్ అందుకున్నారు కడియం. కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు అందించి, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా కడియం శ్రీహరి గెలుపు కోసం తాను ముందుంటానని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి అందరం కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్లి స్టేషన్‌ఘన్‌పూర్‌లో గులాబీజెండా ఎగురవేస్తామని కడియం శ్రీహరి, రాజయ్య పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హామీ ఇచ్చారు. ఇక రాజయ్యను రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే.