స్టేషన్ ఘన్పూర్, నవంబర్ 24 : తాను రాజీనామా చేయడం లేదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
‘స్థానిక ఎన్నికలు నా ఎన్నికలు కాదు.. నా ఎన్నిక గురించి, నా రాజీనామా గురించి ఆలోచించకండి’ అని పేర్కొన్నారు. స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి కార్యాచరణ ఉంటుందని కడియం పేర్కొన్నారు.