Godavari | నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి భారీగా వరద పోటెత్తుతున్నది. భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాలతో పాటు డ్యామ్ పరిసర ప్రాంతాల నుంచి డ్యామ్‌లోకి నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం డ్యామ్‌లో నీటిమట్టం 690.60 అడుగులు ఉన్నది. పూర్తి స్థాయినీటిమట్టం 700 అడుగులు. అధికారులు ప్రస్తుతం మూడుగేట్లు ఎత్తి దిగువకు 14వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మరో వైపు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉగ్రరూపం దాల్చాయి. భారీ వర్షాలకు, ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
దాంతో త్రివేణి సంగమం వరద పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తున్నది. మరో వైపు భద్రచాలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 43.6 అడుగులకు చేరిన ప్రవాహం చేరింది. ఈ క్రమలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇంకా కొనసాగుతుండడంతో వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.