Fire Accident | యాదాద్రి భువగిరి జిల్లా బీబీనగర్ వద్ద రైలులో మంటలు చెలరేగాయి. మిర్యాలగూడ నుంచి కాచిగూడకు వెళ్తున్న సమయంలో భువనగిరి మండలం నాగారెడ్డిపల్లి గ్రామాన్ని దాటుతున్న సమయంలో పొగలు వచ్చాయి. రైలు కింది భాగంలో మంటలు చెలరేగగా.. గమనించిన ప్రయాణికులు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. దాంతో రైలును బీబీనగర్ స్టేషన్లో నిలిపివేశారు. ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎవరికీ ఎలాంటి అపాయం జరుగలేదని అధికారులు తెలిపారు. దాదాపు నుంచి బీబీనగర్ రైల్వేస్టేషన్లోనే రైలు నిలిచిపోయింది. దాంతో ప్రయాణికులు ఇబ్బందులుపడుతున్నారు.