హైదరాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ): ఎల్నినో హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలవారీగా కార్యాచరణ సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి కే సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో డైరెక్టర్ గోపీతో కలిసి ఎల్నినో పరిస్థితులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
తక్కువ నీటి అవసరమున్న పంటల సాగుపై రైతులకు విసృ్తతస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు.