హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): అనేక త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని కే నారాయణ ఆవిషరించారు.
ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, ఎన్ బాలమల్లేశ్, నర్సింహ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, ఎన్ జ్యోతి, పాలమాకుల జంగయ్య, సాయిలుగౌడ్, ఉజ్జని రత్నాకర్‌రావు పాల్గొన్నారు.