హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కేశవరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు గతంలోనే కేకే ప్రకటించగా బుధవారం అధికారికంగా పార్టీలో చేరారు.