హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు
రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్
ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. జస్టిస్ భూయాన్ దైవసాక్షిగా, ఇంగ్లిష్‌లో ప్రమాణం చేశారు. అనంతరం గవర్నర్, సీఎం ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. పుష్పగుచ్ఛం ఇచ్చేప్పుడు పకగా ఉన్న గవర్నర్‌ను మధ్యలోకి రావాలని సీఎం ఆహ్వానించారు.
ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష ఉపనేత కేఆర్ సురేశ్‌రెడ్డి, జస్టిస్ భూయాన్ సతీమణి సంఘమిత్ర, కుమార్తె తదితరులు పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ ఇచ్చిన తేనీటి విందులో సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

