హైరదాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జూనియర్ న్యాయవాదిగా బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చేతిలో ఎలాంటి పత్రాలు లేకుండా ఓ కేసును వాదించి చరిత్ర పుటల్లో నిలిచారని హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్ వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాలను కోర్టు అధికారులు రికార్డు చేయడంతో ఏకంగా 2,000 పేజీలు అయ్యాయని, పటేల్ వాదించిన వైనాన్ని చూసి నాటి బ్రిటిష్ పాలకులు, న్యాయనిపుణలతోపాటు యావత్ న్యాయవ్యవస్థే నెవ్వరపోయిందని చెప్పారు.
నేటి యువ న్యాయవాదులు తమ వృత్తిలో రాణించాలంటే వల్లభాయ్ పటేల్ లాంటివారిని స్ఫూర్తిగా తీసుకోవాలని జస్టిస్ సుజయ్‌పాల్ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన హైకోర్టులో పోలీసుల వందనాన్ని స్వీ కరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, ఏజీ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.