నాంపల్లి కోర్టులు, అక్టోబర్, 2 (నమస్తే తెలంగాణ): అన్ని దేశాల్లో మహాత్మాగాంధీ విగ్రహాలను ప్రతిష్ఠించి ఆయన ఆశయాలను అనుసరిస్తున్నారని, ప్రతిఒక్కరూ తూచ తప్పకుండా పాటించాలని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, జస్టిస్ సుజయ్‌పాల్ స్పష్టంచేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని చంచల్‌గూడలో ఖైదీల సంక్షేమ దినోత్సవానికి హాజరయ్యారు. జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ చిత్రంలో కన్పిస్తున్న ఈ కొండ గొర్రెను రికార్డు ధరకు కొనుగోలు చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని బురుడువాడి ధూల్‌పేటకు చెందిన కమలాపూర్ ప్రభాకర్ రూ.58 వేలు వెచ్చించి కర్ణాటక రాష్ట్రంలోని అమీన్ఘడ్లో కొనుగోలు చేశారు. దసరా వేడుకల కోసం ఈ పొట్టేల్‌ను తీసుకొచ్చారు.
– నారాయణపేట
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు డ్యామ్‌పై బుధవా రం తెల్లవారుజామున మొసలి కనిపించింది. దాంతో పర్యాటకులు, జెన్కో అధికారులు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటికి మొసలి నీటిలోకి దూకింది. – చింతలపాలెం