హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ అవార్డును 2025కు గాను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డికి ఇవ్వనున్నట్టు ‘తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్’ అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి, ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాపరెడ్డి వెల్లడించారు. శనివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మా ట్లాడారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యాలయంలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిం చనున్నట్టు తెలిపారు.