హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు న్యాయం అందించాల్సిన బా ధ్యత మనందరిపై ఉన్నదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ చెప్పారు. హైకోర్టు ఏడో సీజేగా శుక్రవారం ఆయన ప్రమాణ స్వీకారం చేశా రు. అనంతరం ఆయనను హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ (హెచ్‌సీఏఏ) సతరించింది. ఈ సందర్భంగా జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ కోర్టులో న్యాయవాదులు, న్యాయమూర్తులు నా ణేనికి ఇరువైపులా ఉంటారని తెలిపారు.
బాధితుల వాదనలు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెస్తారని తెలిపారు. అనేకమంది న్యాయమూర్తుల్లో న్యాయవాదులుగా చేసినవారే ఉన్నారని చెప్పారు. అందరూ సోదరభావంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో హెచ్‌సీఏఏ అధ్యక్షుడు అనుముల జగన్, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)లు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు, హెచ్‌సీఏఏ కార్యదర్శులు విజారత్ అలీ, ఇంద్రసేనారెడ్డి, బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు సునీల్‌గౌడ్ పాల్గొన్నారు.