కాళేశ్వరం, జూన్ 7: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతీ) బరాజ్‌ను శుక్రవారం సాయంత్రం జస్టిస్ పీసీ ఘోష్‌తోపాటు పలువురు సందర్శించారు. బరాజ్ డౌన్ స్ట్రీమ్‌లో 38వ పిల్లర్ వద్దకు వెళ్లి పరిశీలించారు. గేట్ల వద్దకు వెళ్లి ఇంజినీర్ ఈఈ యాదగిరితో మాట్లాడారు. 2021లో కూడా నీటి బుడగలు ఏర్పడ్డాయని, అప్పుడు వాటిని కాంక్రీట్‌తో నింపి వదిలి వదిలేశామని ఈఈ యాదగిరి తెలిపారు. మళ్లీ 2023 అక్టోబర్‌లో బుడగలు రాగా, వాటిని డ్యామ్ సేఫ్టీ అధికారులు, ఎన్డీఎస్ఈ అధికారుల ఆదేశాలతో ఇసుక తీసి గ్రౌటింగ్ చేస్తున్నామని వారికి వివరించారు. బరాజ్ కట్టిన ఆఫ్కన్ సంస్థ ప్రతినిధులతోనూ మాట్లాడారు.