హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీ ఈఆర్సీ) చైర్మన్‌గా జస్టిస్ దేవరాజు నాగార్జున బుధవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఎర్రగడ్డ కళ్యాణ్‌నగర్‌లోని ఈఆర్సీ కార్యాలయంలో ప్రభు త్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి జస్టిస్ నాగార్జునతో ప్రమాణం చేయించారు. ఇ ప్పటివరకూ ఈఆర్సీ చైర్మన్‌గా ఉన్న తన్నీరు శ్రీరంగారావు పదవీకాలం ఈ నెల 29తో ముగియగా, ఆయన స్థానంలో జస్టిస్ నాగార్జునను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. పదవీ ప్రమాణం చేసిన అనంత రం జస్టిస్ నాగార్జున ఈఆర్సీ చైర్మన్‌గా బా ధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఈఆర్సీ పూర్వ చైర్మన్ శ్రీరంగారావు, పూర్వ సభ్యులు మనోహర్‌రాజు, బండారు కృష్ణ య్య, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో జే ఎండీ శ్రీనివాస్‌రావు, దక్షిణ తెలంగాణ వి ద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ అలీ, జస్టిస్ నాగార్జున సతీమణి శ్రీమతి అమూల్య, సోదరులు చిరంజీవి, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జస్టిస్ నాగార్జున స్వస్థలం వనపర్తి జిల్లా కేంద్రం. పాఠశాల విద్యను వనపర్తిలోని ప్రభుత్వ పాఠశాలలో, ఆర్ఎల్డీ కాలేజీలో బీఎస్సీ పూర్తిచేశారు. గుల్బర్గాలోని ఎస్ఎస్ఎల్ లా కాలేజీలో ఎల్ఎల్బీ, ఉస్మానియా వర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా స్కాలర్షిప్ను సైతం ఆయన అందుకున్నారు. ఇదే వర్సిటీలో ఎంఏ ఏషియన్ స్టడీస్ విద్యనభ్యసించారు. నల్సార్ వర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తిచేశారు. 1991లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 2004లో సీనియర్ సివిల్ జడ్జిగా .. 2010లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా జడ్జిగా, రంగారెడ్డి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా 2015 వరకు పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొంది 2022 వరకు పనిచేసి, ఆ తర్వాత మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయి, అక్కడే పదవీ విరమణ పొందారు.
విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్‌గా నియామకం లు కావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈఆర్సీ చైర్మన్ అనేది గురుతరమైన బాధ్యత. విద్యుత్తు నియంత్రణకు గల చట్టాలను సమగ్రంగా అధ్యయనం చేస్తాం.. కమిషన్ సభ్యుల సహకారాన్ని తీసుకుని ముందుకెళ్తాం. వినియోగదారులు, వాటాదారుల సమస్యలను వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం, డిస్కంల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుం టాం. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తునందించే విషయంలో కమిషన్ తన వంతు పాత్రను నిర్వహిస్తుంది.