మునుగోడు : టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మునుగోడులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సముచిత ప్రాధాన్యత దక్కుతుందని తెలిపారు. ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి మరోసారి కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
మునుగోడు ఓటర్లు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని లింగయ్య యాదవ్ వెల్లడించారు.. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 2014 లో తనను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని తెలిపారు.
మునుగోడు ప్రాంతం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి డిండి ప్రాజెక్ట్ తీసుకొచ్చి తాగు, సాగు నీరు అందిస్తున్నారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి స్వార్ధ రాజకీయం కోసం ఉపఎన్నిక వచ్చిందని మండిపడ్డారు. తనను మరోసారి గెలిపిస్తే అహర్నిశలు అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.