హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): మహానది జల వివాదాల ట్రిబ్యునల్ చైర్మన్‌గా జస్టిస్ బేలా ఎం త్రివేది నియమితులయ్యా రు. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మహానది జల వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల్‌శక్తి శాఖ సిఫారసు మేరకు 2018లో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. చైర్మన్‌గా జస్టిస్ ఏఎం కాన్విల్కర్ను నియమించారు. ఇటీవల ఆయన ఆ పదవికి రా జీనామా చేశారు. దీంతో ట్రిబ్యునల్ కొత్త చైర్మన్‌గా జస్టిస్ బేలా త్రివేదిని నామినేట్ చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు ప్రభుత్వం రూ.76.87కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.