హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తేతెలంగాణ) : దేశంలోని పాలకపక్షాలు దోపిడీదారులను దేశ భక్తులుగా కీర్తిస్తూ, దేశభక్తుల ను దోపిడీదారులుగా చిత్రీకరిస్తున్నాయని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ చంద్రకుమార్ విమర్శించారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలను పురసరించుకుని స్వాతంత్య్ర సమరమోధుల కుటుంబాలు, అభ్యుదయ కవులు, కళాకారులు, మేధావుల సమ్మేళనం హైదరాబాద్ రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో శుక్రవారం జరిగింది. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు, తెలంగాణ అర సం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చంద్రకుమార్ మాట్లాడారు. 2020 నుంచి కార్పొరేట్ సంస్థలు దేశసంపదను దోచుకుంటున్నాయని ఆరోపించారు. దేశంలోని ఓడరేవులు, ఇతర ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలకు పాలకపక్షాలు కట్టబెడుతున్నాయని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అడవులను ఇప్పటికే కార్పొరేట్ సంస్థలకు అప్పగించినట్టు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న ఒప్పందం ఫలితంగా.. దేశంలోకి అకడి పత్తి దిగమతికానున్నదని తెలిపారు. దీంతో వచ్చే ఏడాది నుంచి ఇకడి పత్తి రైతులకు కనీస మద్దతు ధర రూ.4 వేలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ దశలో సిద్ధాంతాలతో కూడిన ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. బీజేపీ మతోన్మాద శక్తులను ఎదురొనేందుకు దేశంలోని కమ్యూనిస్టులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ జాతీయ నాయకుడు పల్లా వెంకట్రెడ్డి ఆకాంక్షించారు. గతం లేకుంటే భవిష్యత్తు లేదని, ఈనాటి తరానికి ఆనాటి త్యా గాల చరిత్రను అందించాలని సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, కందిమళ్ల భారతి సంకలనం చేసిన ‘శతారుణ గీతాంజలి’ వందపాటల పుస్తకం, మకెన సుబ్బారావు రూపొందించిన ‘వందేళ్ల సీపీఐ చర్రితలో మైలురాళ్లు’ అనే పుస్తకాన్ని ఆవిషరించారు.