హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీకి హైకోర్టు మంగళవారం ఘనంగా వీడోలు చెప్పింది. మొదటి కోర్టు హాల్లో జరిగిన వీడోలు సమావేశంలో చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ.. జస్టిస్ షావిలీ ఎనిమిదేండ్లపాటు న్యాయమూర్తిగా పనిచేసి ఎన్నో కీలక తీర్పులను వెలువరించారని, 30,221 కేసులను పరిషరించారని చెప్పారు. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. జస్టిస్ షావిలీ న్యాయవ్యవస్థకు ఎనలేని సేవలు అందించారని అన్నారు. జస్టిస్ షావిలీ మాట్లాడుతూ.. వైద్య కుటుంబంలో జన్మించిన తాను న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించి న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జస్టిస్ షావిలీ భార్య, పిల్లలు, బార్‌కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, పీపీ పల్లె నాగేశ్వరరావు, అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, అదనపు అడ్వకేట్ జనరల్స్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్, రజనీకాంత్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ పాల్గొన్నారు.