జోగులాంబ గద్వాల : జిల్లా పరిధిలోని జూరాల ప్రాజెక్టు ( Jurala Project ) కు వరద ప్రవాహం పెరిగింది. జూరాల ఇన్ఫ్లో 1.03 లక్షల క్యూసెక్కులు కాగా, ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 1.16 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.390 మీటర్లు. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.39 టీఎంసీలు.