ఉద్యాన పంటలపై ప్రణాళిక లేని ప్రభుత్వం
రాష్ట్రంలో ఉద్యాన పంటలు పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనదని మాజీ ఎమ్మెల్యే, ఏఐకేఎస్ జాతీయ కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై పోరాడుదాం
- రైతు సంఘం కేంద్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉద్యాన పంటలు పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనదని మాజీ ఎమ్మెల్యే, ఏఐకేఎస్ జాతీయ కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. గురువారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర వైజ్ఞానిక శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.
రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జూలకంటి మాట్లాడుతూ రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేస్తున్నారని, వాటిని 25 లక్షల ఎకరాలకు పెంచాలని రైతాంగం కోరుతున్నా అవసరమైన నిధుల కేటాయింపు లేదని తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఐక్యంగా పోరాడుదామని జూలకంటి పిలుపునిచ్చారు. రైతులు వానకాలం పంటలు వేస్తున్నా వారి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయలేదని జూలకంటి పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, పీ జంగారెడ్డి, అరిబండి ప్రసాద్‌రావు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

