బండ్లగూడ, ఏప్రిల్ 24 : జుక్కల్ ఎమ్మెల్యే ను బెదిరించిన ఓ యూట్యూబర్‌ను రాజేంద్రనగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డిప్యూటీ కమిషనర్ చింతమనేని శ్రీనివాస్ వివరాల ప్రకారం.. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తనను అప్రతిష్ఠ పాలుచేసే వార్తలు ప్రసారం చేస్తానని ప్రజావాయిస్ న్యూస్‌చానల్ యూట్యూబర్ శ్యాంసుందర్ బెదిరిస్తున్నాడని, వార్తా ప్రసారం కాకుండా ఉండాలంటే రూ.5కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిరుపమా అనిల్‌కుమార్ దాదానియాతో కలిసి తప్పుడు సాక్షాలు సృష్టించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు శ్యాం సుందర్‌పై బీఎంఎస్ 439, 308, 351(3), 352,61(2)3(5) ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, కోర్టు వద్ద యూట్యూబర్ శ్యాంసుందర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఓ మహిళతో సహజీవనం చేసి ఓ బిడ్డను కన్నాడని తెలిపాడు. ఆ మహిళ తనకు న్యాయం చేయాలని సంప్రదించడంతో ఎమ్మెల్యేకి ఫోన్ చేసినట్టు పేర్కొన్నాడు.