 
                                                            Jubilee Hills By Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటి చేస్తున్న నిరుద్యోగ యువకుడు కాశీనాథ్తో పాటు ఆయన మద్దతుదారులు, నిరుద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసింది. తాను రాజకీయ నాయకుడిగా మాట్లాడడం లేదు.. ఒక నిరుద్యోగిగా, ఒక పేద బిడ్డగా మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగుల పరిస్థితి భిక్షగాళ్ల కంటే దారుణంగా ఉంది. గతంలో మా దగ్గర భిక్షం ఎత్తుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఇవాళ మమ్మల్ని భిక్షం ఎత్తుకునే స్థితికి తెచ్చాడు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కొత్తగా ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారో చెప్పాలి. రేవంత్ రెడ్డికి మూడు సవాళ్లు విసురుతున్నాం. మొదటి సవాల్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారో చెప్పాలి. రెండోది రాజీవ్ యువ వికాసం పేరిట రూ. 6 వేల కోట్లు విడుదల చేశారు కదా.. ఆ నిధులు ఎక్కడికి వెళ్లాయి..? ఎవరి జేబుల్లోకి వెళ్లాయి..? నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఏమైందో చెప్పాలని రేవంత్ రెడ్డికి కాశీనాథ్ సవాల్ విసిరారు.
రాష్ట్రంలోని నిరుద్యోగుల పరిస్థితి బిచ్చగాళ్ల కంటే హీనంగా తయారైంది. మళ్లీ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నిరుద్యోగులు ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతున్నామని తెలిపారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు సర్వశక్తులను ఒడ్డుతామన్నారు. చావడానికైనా సిద్ధంగా ఉన్నాం.. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కకుండా చేస్తామని కాశీనాథ్ తేల్చిచెప్పారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిరుద్యోగుల భిక్షాటన
కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగుల పరిస్థితి భిక్షగాళ్ల కంటే దారుణంగా ఉంది
గతంలో మా దగ్గర భిక్షం ఎత్తుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఇవాళ మమ్మల్ని భిక్షం ఎత్తుకునే స్థితికి తెచ్చాడు https://t.co/idoI3RqPpw pic.twitter.com/qAcjtAA1Yz
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2025
 
                            