Jubilee Hills By Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మరో అర గంటలో ముగియనుంది. అయితే సాయంత్రం 5 గంటల సమయం వరకు 45.50 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఇక పలు చోట్ల పోలీసులు, ఎన్నికల అధికారులు కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలుకుతూ దొంగ ఓట్లు వేయించేందుకు సహకరిస్తున్నారు. యూసుఫ్‌గూడ పరిధిలోని కృష్ణానగర్, శ్రీనగర్‌లోని పోలింగ్ బూతుల వద్ద దొంగ ఓట్లు భారీగా వేస్తున్నారు. దొంగ ఓట్లపై బీఆర్ఎస్ నేతలు నిలదీయగా, వారిని అరెస్టు చేశారు పోలీసులు. మరో వైపు షేక్‌పేట పరిధిలోని పలు బూతుల వద్ద పోలీసులు బీఆర్ఎస్ నేతలపై లాఠీఛార్జి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పోలింగ్ సమయం ముగిసే సమయానికి క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు.