జనగామ, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై రాష్ట్రంలోని గిరిజనులు, అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను యూట్యూబ్ చానల్ ద్వారా తెలియజేస్తున్న గిరిజన జర్నలిస్టు ఆర్జే టీవీ రాజ్‌కుమార్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీ వ్రంగా ఖండించారు. జనగామ సబ్ జైలులో ఉన్న జర్నలిస్టు రాజ్‌కుమార్‌ను శనివారం ములాఖత్ ద్వారా వారు వేర్వేరుగా పరామర్శించారు. రాజ్‌కుమార్‌పై పెట్టిన కేసులు ఉపసంహరించుకొని వెంటనే విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలను యూట్యూబ్ చానల్ ద్వారా సోషల్ మీడియాలో పెడుతున్న రాజ్‌కుమార్‌ను అరెస్టుచేసి జైలులో పెట్టడం ప్రశ్నించే గొంతులను నొక్కడమేనని జనగా మ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్ర జాభిప్రాయాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే ప్రభుత్వానికి మింగుడుపడడం లేదన్నారు.