హైదరాబాద్, (నమస్తే తెలంగాణ) మార్చి 5 : జర్నలిజం రెండు వైపులా పదునున్న కత్తి అని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘జర్నలిజం అండ్ పబ్లిక్ రిలేషన్స్’ అనే అంశంపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి మంగళవారం గవర్నర్ హాజరై మీడియా నిపుణులనుద్దేశించి మాట్లాడారు. ఒకదేశ పాలనా స్వభావాన్ని, నాణ్యతను నిర్ణయించడంలో జర్నలిజం, ప్రజాసంబంధాల విభాగాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. మీడియా నిపుణులు ప్రజలు, ప్రభుత్వ విభాగాలకు మధ్య వారధిగా ఉంటూ సమాజహితానికి కృషిచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ శశాంక్‌గోయల్, కోర్సు డైరెక్టర్ డాక్టర్ మాధవీరావులపాటి హాజరయ్యారు.