Huzurabad | చేరికల్లో టీఆర్ఎస్ జోరు.. కాంగ్రెస్, బీజేపీలు బేజారు!
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి ప్రతిరోజూ టీఆర్ఎస్లోకి భారీగా వలస వస్తున్నారు. ఇన్నాళ్లూ బీజేపీ నుంచే చేరికలు ఉండగా.. తాజాగా కాంగ్రెస్ నుంచీ వసలు ఎక్కువయ్యాయి. కారణం.. ఆ పార్టీ లోకల్ అభ్యర్థిని కాకుండా బలహీనమైన, బయటి వ్యక్తిని పోటీకి దించడమేనని అంటున్నారు స్థానికులు. మంగళవారం ఉదయం

Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి ప్రతిరోజూ టీఆర్ఎస్లోకి భారీగా వలస వస్తున్నారు. ఇన్నాళ్లూ బీజేపీ నుంచే చేరికలు ఉండగా.. తాజాగా కాంగ్రెస్ నుంచీ వసలు ఎక్కువయ్యాయి. కారణం.. ఆ పార్టీ లోకల్ అభ్యర్థిని కాకుండా బలహీనమైన, బయటి వ్యక్తిని పోటీకి దించడమేనని అంటున్నారు స్థానికులు. మంగళవారం ఉదయం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో 300 మంది టీఆర్ఎస్ కండువా కప్పుకోగా.. పలు మండలాల్లోనూ అదే హవా కొనసాగుతుంది.
వీణవంక మండలంలో..
హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామం నుంచి 70 మంది బీజేపీ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరిలో మార్త రాజేష్, బండారి సందీప్, ఎల్బాక నరేష్, గంధం నిశాంత్, గంధం విజయ్, ఎల్బాక శివలతో పాటు 70 మంది యువకులు ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తిరుపతి రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామ పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి అరెపల్లి యువకులు
వే-సైదాపూర్ మండలం అరెపల్లి గ్రామం నుంచి బీజేపీ మండల కిషాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మునిపాల ఐలయ్య, అరెపల్లి గ్రామ ఉపాధ్యక్షులు వెంగల మహేశ్‌తో పాటు 30 మంది యువకులు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.

కమలాపూర్ బీజేపీ నుంచి..
కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో బీజేపీ పార్టీకి చెందిన పలువురు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మండల ఇంచార్జి పేరియాల రవీందర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో కాసం అశోక్, నడిగోటి సురేష్, చిలివేరు పోశాలు, ఎండి అహ్మద్, షారుఖ్, రాపాక రాజాచారీ తదితరులు చేరారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

