వనపర్తి, ఏప్రిల్ 29 : రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీనివాసపురం బిజినగడ్డతండాకు చెందిన దాదాపు 30 మంది వెంకటేశ్ నాయక్ ఆధ్వర్యంలో వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధనే ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తున్నదని చెప్పారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.