నల్లగొండ : బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. తాజాగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, జాల్ తాండా గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 20 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని వీడి మంగళవారం హాలియా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్(MLA Nomula Bhagat) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో జాటావత్ హరిలాల్, 3 వార్డు నెంబర్ జాటావత్ స్వామి నాయక్, జాటావత్ వాలా నాయక్ వీరితో పాటు పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పిడిగం నాగయ్య, మండల యూత్ అధ్యక్షుడు జాటావత్ రమేష్ నాయక్, సర్పంచ్ దనావత్ ధుప్షింగ్, సర్పంచ్ స్వామి నాయక్, జాటావత్ ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.