వికరాబాద్, అక్టోబర్ 25 : ప్రజా సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కారు గ్యారంటీ అని, దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి(MLA Mahesh Reddy) పేర్కొన్నారు. బుధవారం పరిగి మండలం గోవిందాపూర్ నుంచి 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, చౌడాపూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు దేశమోని లక్ష్మయ్య, ఎస్.రామచంద్రి, పి.వెంకట్రాములు, ఎస్.గోపాల్, ఎస్.నవీన్, జి.గోపాల్, కె.రాములుతోపాటు 70 మంది, చౌడాపూర్ మండలం ఈర్లవాగుతండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు కె.శ్రీనివాస్, జె.గోపాల్, భరత్, బాబు, రవి, రాంచందర్లతోపాటు 90 మంది బీఆర్ఎస్లో చేరారు.
అలాగే మహ్మదాబాద్ మండలం చౌదర్‌పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు వడ్డె రాజు, కావలి పెద్ద భీమయ్య, రాంజనాయక్, రూప్సింగ్, చారి, వెంకట్నాయక్లతోపాటు 40 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు సమీర్‌తోపాటు ఆయన అనుచరులు 50 మంది ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పారదర్శకంగా, పైరవీలకు తావులేకుండా సంక్షేమ పథకాలు అందుతున్న తెలంగాణ పథకాలు దేశానికే మోడల్‌గా నిలిచాయని, తమ రాష్ర్టాలలో సైతం ఈ పథకాలు అమలు చేయాలని ఆయా రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారన్నారు.
ప్రజా సంక్షేమం కోసం ఎల్లపుడు ఆలోచించే నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలపుడే పథకాలు ప్రకటించడం, ఆరు నెలల్లో వాటికి మంగళం పాడడం పక్కనే గల కర్నాటక రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పథకాలేవి ప్రజలను ఆకర్షించడం లేదన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, కులకచర్ల జెడ్పిటిసి రాందాస్‌నాయక్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.