సంగారెడ్డి : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ చంద్రారెడ్డి, వార్డ్ మెంబర్లు మల్లేశం, యాదయ్య, దుర్గా ప్రసాద్, నాయకులు పాషా, దస్తగిరి, కిరణ్, ఆంజనేయులు, రాములు తదితరులు ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్(MLA Kranti Kiran) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలో జరిగిందన్నారు.

పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని గుర్తు చేశారు. ప్రతి పక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా పని చేసే ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పుల్కల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రమేష్, తదితరులు పాల్గొన్నారు.