నల్లగొండ : జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరుతున్నారు. తాజాగా కొత్తపేట గ్రామ శాఖ అధ్యక్షుడు రాచకొండ సైదులు ఆధ్యర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో 100 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాగా, నిన్న ఒక్క రోజే 200 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరగా.. నేడు మరో 100 కుటుంబాలు నేడు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదన్నారు. మూడోసారి కూడా కేసీఆరే సీఎం కావడం ఖాయమన్నారు. పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మండల పార్టీ మారం వెంకట్ రెడ్డి, జడ్పీటీసీ బొప్పని స్వర్ణలత సురేష్, సర్పంచ్ జనీకి రాములు, ఎంపీటీసీ బుర్రి యాదవ రెడ్డి,ఉప సర్పంచ్ రాములు,మాజీ ఎంపీటీసీ దాసరి సునిత, రైతు సమన్వయ సమితి డైరెక్టర్ మునగ లింగమూర్తి, దాసరి లింగయ్య, కానుగు యాదగిరి, యూసుఫ్అలీ, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు మునగ రవీందర్, జూలూరి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.