Minister Sabitha Indra Reddy | అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటెయ్యాలి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Minister Sabitha Indra Reddy |
ఆర్కేపురం, నవంబర్ 19 : కాంగ్రెస్, బీజేపీని నమ్మితే మోసపోతామని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి సబితాఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy) అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆర్కేపురం డివిజన్ హరిపురి కాలనీకి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పదేళ్ల కాలంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ని గెలిపిస్తేనే బతుకులు బాగుంటాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో నిరంతర అభివృద్ధి కొనసాగాలంటే 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటెసి తనను గెలిపించాలని కోరారు.
ఈ అయిదు సంవత్సరాల కాలంలో ప్రజల ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. అభివృద్ధి విషయంలో రాజీపడకుండా సీఎం కేసీఆర్‌తో మాట్లాడి నిధుల కోరతలేకుండాచూశామని వివరించారు. మరింత అభివృద్ధి కోసం మరోసారి తనను ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోమురుకుంట్ల అరవింద్‌శర్మ, గొడుగు శ్రీనివాస్‌ముదిరాజ్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

