వనపర్తి : తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం. కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి మంత్రి క్యాంపు కార్యాలయంలో వనపర్తి 5వ వార్డు ఇందిరా కాలనీ నుంచి వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన 120 మంది యువకుల..పెబ్బేరు మున్సిపాలిటీ నుంచి గుండ్రాతి నిఖిల్ గౌడ్ ఆధ్వర్యంలో 200 మంది.. శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల, గోపాల్ పేట మండలం చాకలిపల్లి నుంచి బీఆర్ఎస్లో 150 మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పదేళ్లలో తెలంగాణ వ్యవసాయ రంగ స్వరూపం మారిపోయిందన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. అభివృద్ధి కొనసాగాలన్నా.. అన్ని వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా బీఆర్ఎస్ తోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. పనిచేసే ప్రభుత్వానికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.