సూర్యాపేట : సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే అనుమలపురి పరంధాములు కుమారుడు రవిబాబు సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. రవిబాబుతో పాటు ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, నిన్న బీఆర్ఎస్లో ఉత్సాహం నెలకొన్నది. వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. అందులో భాగంగా38వ వార్డు కౌన్సిలర్ గండూరి రాధిక, గండూరి రమేష్ బీఎస్పీకి గుడ్ బై చెప్పి సొంత గూటికి చేరుకున్నారు. వారిని మంత్రి జగదీశ్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.