కాసిపేట, డిసెంబర్ 4 : స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్ధతునిచ్చిన అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపు సాధించి సత్తా చాటుతారని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కొండాపూర్ యాప గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు పోడేటి చంద్ర గౌడ్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలో పార్టీలో ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చిన్నయ్య మాట్లాడుతూ ప్రజలకు బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలు ఎన్నిటికి మర్చిపోరన్నారు. సమన్వయంతో పని చేస్తూ బీఆర్ఎస్ మద్దతునిచ్చిన సర్పంచ్, వార్డు సభ్యుల పోటీదారులను గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణా రెడ్డి, సీనియర్ నేతలు రాంటింకి వాసుదేవ్, సుధాకర్ రెడ్డి, ఈర్ల లచ్చన్న, గ్రామ అధ్యక్షుడు కంది ధర్మయ్య, మాజీ ఉప సర్పంచ్లు పొడేటి సుమన్ గౌడ్, దుర్గం సూర్య ప్రకాష్, కండి నరేష్, సురేష్, రాజేష్, రాజశేఖర్, శ్యాం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.